ఆధిక దాహం వేస్తోందా.. జాగ్రత్త!

102
- Advertisement -

వేసవిలో నీటి దాహం ఉండడం సర్వ సాధారణం. బయట ఉండే విపరీతమైన ఎండ కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి దాహం వేస్తుంటుంది. అయితే సాధారణంగా ఒక రోజుకి 4-5 లీటర్ల నీరు తగాల్సి ఉంటుంది. అప్పుడే మన శరీరంలో నీరు సమతుల్యంగా ఉంటుంది. ఇక వేసవిలో నీరు కాస్త ఎక్కువే తాగాలి ఎందుకంటే ఎండ కారణంగా మన బాడీలోని నీటి శాతం త్వరగా తగ్గిపోతుంటుంది. అందువల్ల వేసవిలో నీరు కాస్త ఎక్కువే తాగాలి. అయితే కొంత మందిలో వెంటవెంటనే ఎన్నిసార్లు నీరు తగిన దాహం తీరదు. దానికి చాలానే కారణాలు ఉన్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం !

డీహైడ్రేషన్
వేసవిలో అధికంగా దాహం వేయడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ కు గురికావడం. ఎవరైనా డీహైడ్రేషన్ బారిన పడితే వారిలో నీటి శాతం చాలా తక్కువగా ఉన్నట్లే అంతేకాకుండా శరీరంలో సోడియం పొటాషియం వంటి ఖనిజల శాతం కూడా తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎక్కువగా పండ్ల రసాలు, గ్లూకోజ్, నిమ్మరసం వంటివి తాగితే శరీరానికి కావల్సిన ఖనిజాలు అంది డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము.

Also read: చెట్లే ఆమె పిల్లలు..తిమ్మక్క నీకు సలాం

చక్కెర వ్యాది
మధుమేహం ఉన్నవారికి కూడా అధిక దాహం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరి శరీరంలో ఉన్న నీటినిల్వలు మూత్రం ద్వారా వెంటవెంటనే బయటకు వెళ్లిపోతుంటాయి. ఈ సమస్య వేసవిలో మరి అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు ఎంత నీళ్ళు తాగిన మళ్ళీ ఆ వెంటనే దాహం వేస్తుంది. అలాంటి సమయాల్లో వైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు పాటించడం మంచిది.

రక్తపోటు
హైబీపీ లేదా లోబీపీ ఉన్న వారికి కూడా ఎక్కువగా దాహం వేస్తుంది. ఎందుకంటే వీరు కొద్దిపాటి టెన్షన్ కు గురైన చెమటలు పట్టడం, వెంటవెంటనే మూత్రం రావడం జరుగుతుంది. తద్వారా శరీరంలోని నీటి శాతం త్వరగా తగ్గుతుంది. ఇది డిహైడ్రేషన్ కు కూడా దారితీసే అవకాశం ఉంది.

Also read: పాలలో బెల్లం కలిపి తాగితే.. ఎన్ని ప్రయోజనలో!

కాబట్టి పై ఈ వేసవిలో అధిక దాహం వేసినప్పుడు ఏమాత్రం నిర్లక్షం చేయకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

- Advertisement -