- Advertisement -
కరోనాపై పోరులో ఇప్పుడు అందరికి వినిపిస్తున్న పోరు సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలోనే అత్యధిక స్ధాయిలో వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్న సీరం అధినేత ఆధార్ పూనావాలకు అరుదైన గౌరవం దక్కింది.ఏషియన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు.
సీరం అధినేతతో పాటు చైనా పరిశోధకుడు జాంగ్ యాంగ్‌జెన్, చైనాకు చెందిన మేజర్ జనరల్ చెన్ వీయి, జపాప్‌కు చెందిన డాక్టర్ రుచి మోరిషిట, సింగపూర్ ప్రొఫెసర్ ఓయి ఇంగ్ ఇయాంగ్‌లు ఉన్నారు. సింగపూర్‌కు చెందిన డైలీ పత్రిక ద స్ట్రెయిట్స్ టైమ్స్ ఈ అవార్డులను ప్రకటించింది. కోవిడ్19 పోరాటంలో పనిచేసిన వారికి ఈ గుర్తింపు ఇచ్చారు.
మీ ధైర్యం, సాహసం, దీక్ష, సృజనాత్మకతకు సెల్యూట్ చేస్తున్నామని, ఇలాంటి భయానక సమయంలో మీరు ఆసియా ప్రజలకు ఆశా దీపికల్లా నిలిచారని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.
- Advertisement -