‘ఆదా’ డ్యాన్స్‏కి ఫిదా.. (వీడియో)..

322
Adah-Sharma-Kethak-Dancc
- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు కథానాయిక ఆదాశర్మ. మొదటి సినమాతోనే మంచి విజయం అందుకుని వరుస అవకాశాలు అందుకుంది. కానీ తరువాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అవకాశాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాయింగ్ మాత్రం తగ్గడం లేదు ఈ బ్యూటీకి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండి.. తన డ్యాన్స్ లతో, ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటారు.

Adah Sharma On Kiki Challenge in My Feelings

తాజాగా ఈ అమ్మడు పోస్టు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హాలీవుడ్ హాస్య నటుడు షిగ్గి ‘ఇన్ మై ఫీలింగ్’ పాటను సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ విసిరారు. ఈ పాటకి ఇప్పటికే సోషల్ మీడియాలో ఛాలెంజ్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇదే పాటకి ఆదా శర్మ.. తెల్లటి దుస్తులతో భరతనాట్యం, కథక్ రెండు కలిపి డ్యాన్స్ చేసిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ అమ్మడు పోస్టు చేసిన 24 గంటలలోనే 7 లక్షల మందికిపైగా వీక్షించారు. 3 వేలకు పైగా కామెంట్లు చేశారు. అద్భుతంగా చేశారు, ఈ పాటకి ఇలా కూడా డ్యాన్స్ చేస్తారా…? సూపర్ అంటూ మరోకరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -