లేడి ఓరియెంటెడ్‌ వెబ్ సిరీస్‌లో హార్ట్ అటాక్ బ్యూటీ..!

174
Adah sharma
- Advertisement -

వెబ్ సిరీస్‌తో తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది అందాల భామ అదా శర్మ. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతుండగా అమెజాన్ ప్రైమ్ నుండి అదాకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. లేడీ ఓరియంటెడ్ బోల్డ్ వెబ్ సిరీస్ లో అదా శర్మ ఛాన్స్ లభించినట్లుగా సమాచారం. హిందీతో పాటుగా సౌత్ భాషల్లోను స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

హర్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. ఆతర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’, ‘కల్కి’ సినిమాల్లో నటించింది. అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. చాలాకాలం తర్వాత వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్దమైన ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -