కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసందే. 2019లో ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీని మరియు మోదీ పేరు పెట్టుకున్న వాళ్లంతా దొంగలే అని అన్న రాహుల్‌గాంధీ…తాజాగా సురత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష వేసింది.కానీ లోక్‌సభ సెక్రటరీ స్పందిస్తూ రాహుల్ గాంధీ అనర్హుడిగా ప్రకటించింది.
తాజాగా రాహుల్ స్పందిస్తూ మీడియాతో మాట్లాడుతూ… గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి అదానీతో మోదీకి సబంధాలున్నాయి. లోక్‌సభలో నా ప్రసంగాన్ని కావాలనే తొలగించారు. నిబంధనలను ఉల్లంఘించిన అదానీకి ఎయిర్‌పోర్టులు కట్టబెట్టారు. నా గురించి మంత్రులు పార్లమెంట్‌లో అబద్దాలు చెప్పారు. లండన్ ప్రసంగంపై తప్పుడు ప్రచారం చేశారు. మంత్రుల ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. అందుకు స్పీకర్ నవ్వి.. మాట్లాడే అవకాశం రాదు అని నాతో అన్నారు.
నేను దేనికీ భయపడను. ప్రశ్నించడం మానను. అదానీ వ్యవహారంపై ప్రశ్నిస్తూనే ఉంటా అని అన్నారు. అదానీ షెల్ కంపెనీలపై మోదీ సమాధానం చెప్పాలి. అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడి పెట్టారో వెల్లడించాలి. చైనీయులు కూడా అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోందన్నారు. నా ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేయించారు. నాకు మద్దతిచ్చిన విపక్ష నేతలకు ధన్యవాదాలు.
ప్రతిపక్ష నేతలందరితో కలిసి పనిచేస్తా. నా సభ్యత్వాన్ని పునరుద్ధరించినా నా పోరాటం ఆగదు అని రాహుల్ తెలిపారు. ఈ దేశం తనకు కావాల్సినవన్నీ ఇచ్చిందని చెప్పారు. తనకు ఈ దేశం ప్రేమ, గౌరవం ఇచ్చిందన్నారు. వయనాడ్ ప్రజలతో తనకు కుటుంబ సంబంధాలున్నట్లు చెప్పారు. అదానీ షెల్ కంపెనీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంల పెట్టుబడి ఉంటే జైల్లో వేయాలని రాహుల్ సవాల్ విసిరారు. తనని పార్లమెంట్ నుంచి శాశ్వతంగా బహిష్కరించినా భయపడేది లేదని రాహుల్ తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి…