నటి త్రిషకు కరోనా పాజిటివ్

98
trisha
- Advertisement -

దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. వారం రోజుల క్రితం వరకు రోజుకు 10 వేల లోపే కరోనా కేసులు నమోదుకాగా ఇప్పుడు రోజుకు కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తుండగా తాజాగా సినీ నటి త్రిషకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా నియమాలు పాటిస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త ఏడాదికి కొంచెం ముందు నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకు ఉన్నాయి. అయినా కానీ ఆ వారాలు నాకు చాలా బాధ కలిగించాయి. ప్రస్తుతానికి నేను కోలుకొంటున్నాను.. వాక్సినేషన్ వలన ఈరోజు నేను బావున్నాను. దయచేసి అందరు వాక్సిన్ వేయించుకొని.. మాస్క్ వేసుకోండి అని విజ్ఞప్తి చేసింది త్రిష.

https://twitter.com/trishtrashers/status/1479485206771945476/photo/1

- Advertisement -