బన్నీకి శ్రియ అదిరిపోయే ఛాలెంజ్..!

555
sriya

కరోనా వైరస్ విజృంభనతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 10వ రోజుకు చేరుకుంది. కరోనాపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు.

అయితే లాక్ డౌన్‌తో చాలామంది ఇంట్లో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియా,యోగాతో కాలక్షేపం చేస్తుండగా సినీ నటి శ్రియ కాస్త కొత్తగా ఆలోచించింది.

తన భర్త అండ్రీ కొస్చీవ్‌తో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న వీడియోని షేర్ చేసింది. మీరు కూడా మీ భర్తలతో వంట పాత్రలను శుభ్రం చేయించండని తెలిపిన శ్రియ పలువురు నటులకు ఈ ఛాలెంజ్‌ని విసిరింది.

వీరిలో అల్లు అర్జున్, ఆర్య, ఆశిష్ చౌదరి, ‘జయం’ రవి కూడా ఉన్నారు.  తమ అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని అలాగే తమ భర్తలు పనిచేస్తున్నప్పుడు తీసిన వీడియోను పోస్ట్ చేయాలని కోరింది శ్రియా. మరి వీరిలో ఎంతమంది ఈ ఛాలెంజ్‌కు స్పందిస్తారో చూడాలి..