ఎంపీగా గెలిచిన చిరు హీరోయిన్!

15
- Advertisement -

నటి రచన…అందరికి గుర్తుండే ఉంటుంది. 1990లో అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన రచన చిరుతో బావగారు బాగున్నారా సినిమా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ తాజాగా సీన్ కట్ చేస్తే ఎంపీగా గెలిచారు. బెంగాల్‌లోని హుగ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రచన..బీజేపీ సిట్టింగ్ లాకెట్ ఛ‌ట‌ర్జీపై దాదాపు 76 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది.

సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు తృణమూల్‌లో చేరిన రచన ఎంపీగా గెలవడం విశేషం. తెలుగుతో పాటు బెంగాళీ, త‌మిళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో సినిమాలు చేసింది. ఒడిశా యాక్ట‌ర్ సిద్ధాంత్ మ‌హోపాత్ర‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది రచన. ప‌దేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి వైవాహిక బంధానికి 2004లో ముగింపు ప‌డింది. ఇక 2007లో ప్ర‌బోల్ బ‌సును పెళ్లి చేసుకోగా 2017 లో అత‌డి నుంచి విడిపోయింది.

Also Read:పవన్ ‘తమ్ముడు’ రీ రిలీజ్!

- Advertisement -