నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
నటిగా మారాలని అనుకున్నప్పుడే మంచి పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నా వరకు వచ్చిన కథల్లోంచి మంచి కారెక్టర్‌లను ఎంచుకున్నాను. అందులో కొన్ని వర్కవుట్ అవుతాయి. కొన్ని కావు. ఫలితం మనం చేతుల్లో ఉండదు. కానీ నేను మాత్రం మంచి పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాను.
బాలకృష్ణ గారు చాలా సీనియర్. అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఇది వరకు ఆయన రెండు మూడు సార్లు కలిశాను. కానీ ఆయనతో మొదటి రోజు పని చేస్తున్నాని తెలియడంతో ఎంతో నర్వస్‌గా ఫీలయ్యాను. కానీ కలిసిన ఐదు నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయన అలా నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్ అవుతుంది. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన గ్రేట్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను.
నేను ఈ చిత్రం ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషించాను. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఇది వరకు చూసిన ప్రగ్యా కనిపించొద్దని బోయపాటి గారు అన్నారు. ఆ పాత్రను పోషించేందుకు చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
నాకు బోయపాటి గారి మీద చాలా నమ్మకం ఉంది. ఆయక ఒక పాత్ర కోసం ఒకరిని అనుకున్నారంటే అది కచ్చితంగా పర్ ఫెక్ట్ చాయిస్‌లా ఉంటుంది. ఆయన ఎంతో ఆలోచించి గానీ ఒక పాత్రకు ఆర్టిస్ట్‌ను ఎంచుకోరు. ఆయనకు ఎలాంటి వారు కావాలి.. సినిమాను ఎలా తీయాలి అనేది బాగా తెలుసు. అందుకే ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు మొత్తం కథ వినకుండానే ఓకే చెప్పాను. నాకు ఆయన మీద ఆ నమ్మకం ఉంది.
పాండమిక్ తరువాతే నాకు ఈ ఆఫర్ వచ్చింది. కొత్తగా మొదలుపెట్టాలని అనుకున్నాను. సెట్‌లో ప్రతీరోజూ ఏదో ఒక కొత్త విషయాన్నీ నేర్చుకున్నాను. బాలకృష్ణ గారు, బోయపాటి గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను.
అఖండ లాంటి కథ, అలాంటి కారెక్టర్ నేను ఇంత వరకు చూడలేదు. ఇక్కడే అని కాదు. ఇతర భాషల్లోనూ అలాంటి పవర్ ఫుల్ పాత్రను నేను చూడలేదు. బాలకృష్ణ గారు ఆ పాత్రలో డిఫరెంట్ లెవెల్‌లో కనిపిస్తారు. ఉదయాన్నే మూడు గంటలకు లేస్తారు.. ఆరు గంటలకే సెట్‌కు వస్తారు.. రోజంతా షూటింగ్ చేస్తారు.. మీరు మనిషేనా? అని అడిగేశాను. బాలకృష్ణ గారు అంత పవర్ ఫుల్ వ్యక్తి కావడంతోనే బోయపాటి గారు అఖండ లాంటి పాత్రను రాశారేమో.
అఖండ చిత్రంలో నాది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ కారెక్టర్ చుట్టే కథ తిరుగుతుంది. నాకు ఎదురైన సంఘటనల వల్లే రెండో పాత్ర అయిన అఖండ ఎంట్రీ ఉంటుంది. అలా ఈ సినిమాలో నాకు నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న కారెక్టర్ దక్కింది.
నటీనటుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో బోయపాటి గారికి బాగా తెలుసు. ఆయన విజన్, పర్ఫెక్షన్ ఎంతో బాగుంటుంది. సెట్‌లో అందరినీ హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. నటీనటులకు ఎంతో స్వేచ్చనిస్తారు. కొన్ని సార్లు ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే సరిపోతుంది.
ద్వారక క్రియేషన్స్‌లో ఇది నాకు రెండో సినిమా. నిర్మాత రవీందర్ రెడ్డి గారికి సినిమాలంటే ఎంతో ప్యాషన్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
బాలకృష్ణ గారు, బోయపాటి గారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అందుకే నేనే ఎక్కువగా సోషల్ మీడియాలో మా సినిమాను ప్రమోట్ చేశాను. నా సినిమా అంటే నాకు ఎంతో ఎగ్జైట్ ఉంది. అందుకే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నాను. ఈ విషయంలో నేను, తమన్ కూడా మాట్లాడుకున్నాం. మనిద్దరమే ఉన్నాం.. ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నాం.
శ్రావణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. అఖండ సినిమా వర్కవుట్ అవుతంది. కచ్చితంగా నా పాత్ర కూడా అందరికీ రిజిస్టర్ అవుతుంది. నేను ఇంత వరకు సినిమాను చూడలేదు. కానీ అక్కడక్కడా రషెస్ చూశాను. సినిమా అద్బుతంగా వచ్చింది. అడిగా అడిగా పాటలో అద్భుతంగా కనిపించాను అని కెమెరామెన్ ప్రశంసించారు.
కమర్షియల్ చిత్రాల్లో ఉండేట్టుగా ఇందులో పాటలు ఉండవు. అడిగా అడిగా అనే మెలోడి పాట ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇంకో పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున విడుదల చేస్తున్నాం. మాస్ బీట్‌లో ఆ పాట ఉంటుంది. నాకు డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం. ఆ పాటలో నాకు అవకాశం వచ్చింది. ఆ పాట రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా.
జగపతి బాబు సార్ గారిని ఆ గెటప్‌లో చూసి మొదటి రోజు గుర్తు పట్టలేదు. ఆయన పిలవడంతో ఆ తరువాత గుర్తు పట్టాను. అలా బోయపాటి గారు అందరినీ మార్చేశారు. ఈ సినిమాలో ఉన్న ప్రతీ ఒక్కరి నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.