అఫిషియల్‌….అక్టోబర్‌ 30న కాజల్ పెళ్లి

230
kajal
- Advertisement -

కొంతకాలంగా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌ను పట్టించుకోని బ్యూటీ కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు స్పందించింది. తాను ప్రేమించిన వ్యక్తిని ఈ నెల 30న పెళ్లి చేసుకోబోతున్నానని వెల్లడించింది.

ముంబైలో స్థిరపడ్డ బడా వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతోంది కాజల్‌. క‌రోనా మ‌హమ్మారి వ‌ల‌న కొద్ది మంది స‌భ్యుల మ‌ధ్య పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు పేర్కొంది.

ఇన్నేళ్ళ నా ప్రయాణంలో నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తూ నాపై ప్రేమ‌ను చూపిస్తున్న మీ అంద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని కాజ‌ల్ పేర్కొంది. కాగా, ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది.

- Advertisement -