- Advertisement -
లవ్ యు బంగారం చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన శ్రావ్య చెల్లెలు గ్రీష్మ కి ఇప్పుడు టాలీవుడ్‌లో ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. ఈ అమ్మడు వందేమాతరం శ్రీనివాస్ నటించిన అమ్ములు చిత్రంలో బాలనటిగా నటించింది. రీసెంట్‌గా మహానాయకుడులో యువ వయస్సు బసవ తరకంగా నటించి నందమూరి బాలకృష్ణ, దర్శకులు క్రిష్, నిర్మాత వారాహి సాయి ప్రశంశలు పొందింది.
అంతే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానం పొందిన గ్రీష్మ కి వరుసగా ఆఫర్స్ రావటం విశేషం.. అన్ని రకాల పాత్రలు చేస్తాను అంతేకాదు తెలుగు సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని ముద్దుగా చెప్తుంది గ్రీష్మ.
- Advertisement -