మొక్కలునాటిన సినీ నటి ఆషిమ నర్వాల్..

86
green challegne
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటి ఆషిమ నర్వాల్. ఈ సందర్భంగా ఆషిమ నర్వాల్ మాట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడుకోవడం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.వాతావరణంలో మార్పులు అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చాలెంజ్ ఎంతగానో అవసరమని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆషిమా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తన స్నేహితులు యశా వీరమంచి, వెంకట్రావ్,ప్రశాంత్ రెడ్డి,హర్షం గుర్రం కొండ నలుగురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు ఆషిమా నర్వాల్.

- Advertisement -