పేకాడినందుకు నటులపై కేసు..!

238
Online News Portal
Actors promoting online gambling
- Advertisement -

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్క భారీ హిట్ వచ్చిందంటే తలరాతలే మారిపోతాయి. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను యాడ్‌లలో ఇన్వెస్ట్‌ చేసి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నారు నేటితరం హీరోలు. డబ్బుల కోసం ఎలాంటిదాన్నైనా ఎండార్స్ చేయడానికి వెనుకాడడం లేదు. ఎందుకంటే అది వారికి సినిమా కంటే ఎక్కువ డబ్బులు తెచ్చిపెడుతుంది కాబట్టి. ఒక సినిమా కోసం దాదాపు నాలుగు నెలలు పడిన కష్టం ఇక్కడ కేవలం రెండు రోజులు మొఖానికి మేకప్ వేసుకుంటే ఒచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు – తమిళ పరిశ్రమ లో పెద్ద స్టార్ లు అయిన ప్రకాష్ రాజ్ , రానా దగ్గుబాటి లు రమ్మీ సర్కిల్ అనే ఆన్ లైన్ పేకాట వెబ్సైటు కోసం ప్రచారం చెయ్యడం విశేషంగా మారింది.

rana1

“రమ్మీ ఆడండి డబ్బులు గెలవండి” అంటూ హీరో రానా మీడియా ప్రకటనల్లో నటించడంపై కేసు నమోదైంది. పేకాటను ప్రోత్సహిస్తున్నారంటూ, రానా, ప్రకాష్ రాజ్ లపై తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన ఇళంగోవన్ అనే సామాజిక కార్యకర్త కేసు పెట్టాడు. వీరిద్దరూ ప్రజల మనసులను గ్యాంబ్లింగ్ వైపు మళ్లించేలా ప్రకటనల్లో నటిస్తున్నారని, పేకాటను ప్రమోట్ చేస్తున్న వీరి యాడ్లు టీవీల్లో వస్తున్నాయని కోయంబత్తూరు పోలీస్ కమిషనర్ కు ఆయన ఫిర్యాదు చేశాడు. బెట్టింగ్, రమ్మీ, గ్యాంబ్లింగ్ వంటి ఆటలపై నిషేధం అమలులో ఉండటంతో ఇళంగోవన్ ఫిర్యాదును స్వీకరించి విచారణ ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

rana

మన దేశంలో పేకాట ఆడ్డం తప్పే కానీ.. అదే ఆన్ లైన్లో అయితే నిక్షేపంగా ఆడేసుకోవచ్చు. అందుకే నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉన్న యాక్టర్లతో యాడ్ ఇచ్చేసింది జంగ్లీ రమ్మీ. ప్రకాష్‌ రాజ్‌, రానాలిద్దరూ కలిసి ఇంట్లో పేకాట ఆడుకోవడంలో ఇబ్బందులను ప్రాక్టికల్ గా చూపించి మరీ.. ఆన్ లైన్ లో రమ్మీ ఆడుకోమని సలహా ఇస్తున్నారు. ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్నవాళ్లు.. యాడ్స్ చేస్తే వచ్చే డబ్బుల కోసం.. ఇంటింటికే కాదు.. ఫోన్ ఫోన్ కీ రమ్మీ ఆడుకోమని చెప్పడం చాలా దారుణమైన విషయమని పలువురు విమర్శిస్తున్నారు.

- Advertisement -