చెన్నైలోనే పెళ్లి …..

254
online news portal
Naga Chaitanya and Samantha relationship
- Advertisement -

త్వరలోనే వివాహ బంధంతో ఏకం కాబోతుంది నాగచైతన్య, సమంత జంట. సంవత్సర కాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జోడీకి ఇటీవలె అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకంటే…ఇక సమంత పెళ్లిమాత్రం తన హోమ్‌ టౌన్‌ చెన్నైలోనే జరగాలంటోదట. దీనికి నాగ చైతన్యతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సంప్రదాయబద్దంగా హిందూ మత ధర్మం ప్రకారం నాగచైతన్య, సమంత వివాహాం జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగేందుకు ఇప్పటి నుంచే చెన్నైలో వేదికను ముస్తాబు చేస్తున్నట్టు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చెన్నైలో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నట్టు అని మనకు సందేహాం రావచ్చు. ఎందుకంటే తెలుగులో కంటే సమంతకి తమిళంలోనే ఎక్కువగా క్రేజ్ ఉందట. అక్కడ టాప్‌ హీరోలందరితో కలిసి సమంత పని చేయడమే దీనికి కారణం అయి ఉండొచ్చని టాక్‌. అయితే పెళ్లి తర్వాత హైదరాబాద్‌లోనే సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకుంది సమంత.

ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పిన తరువాత సమంత ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అందుకోసమే సమంత కొత్త సినిమాలకు సంతకం పెట్టడం లేదట. పెళ్లి తర్వాత సమంత సినిమాలకు బైబై చెబుతుందని అభిమానులు కొంత ఫీల్‌ అయ్యారు. కాని ఈ మధ్య నాగచైతన్య సమంత సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి తర్వాత కూడ ఆమె సినిమాలో నటిస్తుందని నాగ చైతన్య ఇంటర్వ్యూ లో స్పష్టంచేశాడు. దీనితో సమంత అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు.

online news portal
ఏం మాయ చేశావే సినిమాతో జర్నీ మొదలుపెట్టిన సమంత.. ఇప్పటి వరకు 26 సినిమాలో నటించింది. ఆమె నటించిన చాలా సినిమాలు వందకోట్ల క్లబ్‌లో ఉండటం గొప్ప విషయమే. సమంత నటించిన 11 సినిమాలకు పైగా వందకోట్లను వసూలు చేసాయి. ఈ మధ్యలో త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘అఆ’ నితిన్‌హీరోగా, సమంత హీరోయినగా నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. స్పెషల్‌గా చెప్పుకొవాలంటే తమిళంలో చేసిన తేరీ, సూర్యతో చేసిన 24మూవీ ముందంజలో ఉన్నాయని టాక్‌.
- Advertisement -