ఐనాక్స్‌ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించిన అడవి శేష్‌..

64
Actor Sesh Adivi
- Advertisement -

భారతదేశపు అగ్రగామి మల్టీప్లెక్స్‌ సంస్ధ ఐనాక్స్‌ శుక్రవారం హైదరాబాద్‌లో తమ 4వ మల్లీప్లెక్స్‌ను సత్వా నెక్లెస్‌ మాల్‌ వద్ద ప్రారంభించింది. ఈ మల్లీప్లెక్స్‌ను ‘మేజర్‌’మూవీ హీరో అడవి శేష్‌, దర్శకుడు శశి కిరణ్‌ తిక్క లు కలిసి ప్రారంభించారు. ఈ మాల్‌ కవాడీగూడా మెయిన్‌ రోడ్‌, సికింద్రాబాద్‌లో ఉంది. ఈ నూతన మల్టీప్లెక్స్‌లో 7 ఆకర్షణీయంగా డిజైన్డ్‌ ఆడిటోరియాలు ఉంటాయి. మొత్తం 1534 సీట్లు కలిగిన ఈ మల్టీప్లెక్స్‌లో 103 విలాసవంతమైన రీక్లైనర్‌ సీట్లు ఉన్నాయి.

ఐనాక్స్‌ ఇప్పుడు నాలుగు మల్టీ ప్లెక్స్‌లను 26 స్క్రీన్‌లతో హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఈ మల్టీప్లెక్స్‌లోని ఏడు స్క్రీన్‌లు కూడా సౌకర్యవంతమైన అనుభూతులను అందించడంతో పాటుగా అత్యున్నత శ్రేణి సినిమా సాంకేతికతలను సౌండ్‌, ప్రొజెక్షన్‌లు కలిగి ఉన్నాయి. రేజర్‌ –షార్ప్‌ విజువల్స్‌ కోసం అత్యాధునిక డిజిటల్‌ ప్రొజెక్షన్‌ సిస్టమ్‌ను ఈ ఆడిటోరియా, ఆహ్లాదకరమైన 3డీ వ్యూను అందిస్తుంది.

దీనికి వోల్ఫోనీ స్మార్ట్‌ క్రిస్టల్‌ డైమండ్‌ సొల్యూషన్‌ తోడ్పాటునందిస్తుంది. ఈ మల్టీప్లెక్స్‌లో డాల్బీ అట్మాస్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఏడు స్క్రీన్‌లలోనూ అందుబాటులో ఉంది. దీంతో సినీ అభిమానులు ఉరుములతో కూడిన శబ్ద అనుభవాలను పొందుతారు.

- Advertisement -