స్టార్‌ ఇమేజ్‌ కోసం క్రికెటర్లతో డేటింగ్‌..!

196
Actor Richa Chadha On Harassment In Bollywood
- Advertisement -

ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రిచా చద్దా . అనురాగ్ కశ్యప్ చిత్రం ‘గంగాస్ ఆఫ్ వాసేయ్‌పూర్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె  టించిన ‘జియా ఔర్ జియా’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా రిచా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పేరు ప్రఖ్యాతుల కోసం సూపర్ స్టార్లు, క్రికెటర్లతో సంబంధాలు పెట్టుకోవాలని ఒకరు సూచించారంటూ బాంబు పేల్చింది. పర్సనల్ అసిస్టెంట్ ఒకరు ఫలానా నటుడికి టెక్ట్స్ మెసేజ్ పంపించాలని చెప్పాడు. అతడితో డేటింగ్ చేయమని కోరాడు. అతడికి పెళ్లయింది కదా? అని ప్రశ్నిస్తే అప్పుడతడు ఓ క్రికెటర్ పేరు చెప్పి అతడికి  మెసేజ్ ఎందుకు పంపించకూడదు? అని ఎదురు ప్రశ్నించాడు. మీ పబ్లిక్ ఇమేజ్‌కు, పబ్లిక్ రిలేషన్స్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని అతడు తనకు సలహా ఇచ్చాడని వివరించింది.

అయితే తానెప్పుడూ డేటింగ్ జోలికి వెళ్లలేదని పేర్కొంది. బయట నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన వారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని చెప్పింది. తనకు ఇటువంటివి ఇష్టం లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారని వివరించింది.

- Advertisement -