ఏపీలో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింద. టీడీపీ-వైసీపీ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతుందని ప్రచారం జరుగుతుండగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల పోరులో భాగంగా పార్టీకి మరింత సినీ గ్లామర్ అద్దేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రోజా వంటి స్టార్ పార్టీలో కీలకంగా మారగా రచయిత పోసాని కృష్ణమురళి సైతం జగన్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రానున్న ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైసీపీతో అసోసియేట్ అయి వున్న పృథ్వీ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా హల్చల్ చేశాడు. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో కొంత దూరం నడిచాడు. వైసీపీ భావజాలాన్ని మీడియా వేదికగా గట్టిగా వినిపించాడు.
ఈ నేపథ్యంలో పృథ్వీని రానున్న ఎన్నికల్లో బరిలోకి దింపితే పార్టీకి లాభిస్తుందని జగన్ భావిస్తున్నారట. అందుకే ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతను పృథ్వీకి అప్పగించడంతో ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒకచోటి నుండి ఆయన్ను పోటీచేయించేలా కసరత్తు చేస్తున్నారు. పృథ్వీ సైతం ఎన్నికల బరిలో నిలిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో కమెడీయన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న పృథ్వీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ మేరకు సక్సెస్ అవుతాడో వేచిచూడాలి.