మొక్కలు నాటిన ప్రియదర్శి, రోల్ రైడా

518
Green challeange Aa
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్దోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించారు. తాజాగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడా. జూబ్లిహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటారు.అనంతరం మరో ముగ్గురికి సవాల్ విసిరారు. యాంకర్ రవి, బిగ్ బాస్2 ఫేమ్ భాను, హీరో వడ్డే నవీన్ కు సవాల్ స్వీకరించారు.

ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అనసూయ, బిత్తిరి సత్తి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి,లాంకో హిల్స్ లేక్ సమీపానగల ghmc పార్క్ నందు ప్రముఖ సినీ నటుడు మల్లేశం ఫేమ్ ప్రియదర్శి మొక్కలు నాటారు . ప్రకృతి ని కాపాడుకుని మానవ జాతి మనుగడకు మనవంతు సాయం చేసే అవకాశం ఇచ్చిన జోగినపల్లి సంతోష్ గారికి , ప్రత్యేక అభినందనలను తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ పాల్గోన్నారు.

Darshi

- Advertisement -