ఇందు, గోపి = ఇగో

219
Simran Sharma
- Advertisement -

ఆశిష్‌రాజ్, సిమ్రన్ జంటగా నటిస్తున్న చిత్రం ఇగో. ఆర్.వి. సుబ్రహ్మణ్యం(సుబ్బు) దర్శకత్వం వహిస్తున్నారు. వి.కె.ఏ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కరణ్, కౌశల్‌కరణ్, అనిల్ కరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో వుంది. ఇవాళ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా యూనిట్ ప్రేస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇందు, గోపీ అనే ఓ జంట ప్రేమకథా చిత్రమిది. అహంభావ మనస్తత్వం కలిగిన వారు ఎలా ఏకమయ్యారు? అనేది ఆసక్తిని పంచుతుంది. రొమాన్స్, సస్పెన్స్ అంశాలతో పాటు చక్కటి వినోదం ఉంటుంది. గ్రామీణ, పట్టణ సంస్కృతుల నేపథ్యంలో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతుంది. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాం. నాణ్యత విషయంలో రాజీపడకుండా అనుకున్న సమయం కంటే ముందుగానే చిత్రాన్ని పూర్తిచేస్తాం అని తెలిపారు. దీక్షాపంథ్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, శివన్నారాయణ, భద్రం, షకలక శంకర్, చంద్ర, వేణు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ప్రసాద్ జి.కె.

- Advertisement -