మొక్కలు నాటిన ఏసీపీ ప్రతాప్ కుమార్…

176
police
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా డీసీపీ పుష్ప విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలో మొక్కలు నాటారు ఏసీపీ ప్రతాప్ కుమార్. మరో ముగ్గురు సి ఐ లకు ఛాలెంజ్ విసిరారు ఏసీపీ ప్రతాప్ కుమార్.

ఆర్మూడ్ రిజర్వ్ అదనపు డి.సి.పి గిరిరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూడ్ విభాగం రిజర్వ్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు మంగళవారం తన కార్యాలయము అవరణలో మొక్కను నాటడంతో పాటు మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ నరేష్, వరంగల్ పోలీస్ అధికారుల అధ్యక్షుడు పంజాల అశోక్ కుమార్ గౌడ్, పరిపాలన విభాగం పర్యవేక్షణాధికారి చంద్రకళను గ్రీన్ ఛాలేంజ్ కు నామిటెడ్ చేశారు.

పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం , ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని , ఈఅవకాశం కల్పించిన ఆర్మూడ్ రిజర్వ్ అదనపు డి.సి.పి గిరిరాజుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -