మొక్కలు నాటిన కమెడియన్ వేణు…

63
comedian venu

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు కమెడియన్ వేణు.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని కమెడియన్ వేణు అన్నారు.

పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కమెడియన్ తాగుబోతు రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన నివాసంలో మొక్కలు నాటిన కమెడియన్ వేణు… అనంతరం మరో ముగ్గురు ( కమెడియన్ లు ధన్ రాజ్ , చిత్రం శ్రీను , పాట్రియా వెంకీ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.