మొక్కలు నాటిన ఏసీబీ డీజీ పూర్ణ చంద్రరావు

458
Acb Dg Purna
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. సినీ, రాజకీయ ప్రముకులే కాకుండా ప్రజలు కూడా స్వచ్చందంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటుతున్నారు.

తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్ విసిరిన సవాల్ ను స్వీకరించారు అవినీతి నిరోధక శాఖ డీజీ డాక్టర్ పూర్ణ చంద్ర రావు. ఏసీబీ ప్రధాన కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

- Advertisement -