ఒకే రోజు ఏసీబీ వలలో ముగ్గురు..!

455
acb rides
- Advertisement -

హైదరాబాద్‌లోనే తొలిసారి ఏసీబీ వలలో వేర్వేరు డిపార్ట్‌మెంట్‌లకు చెందిన ముగ్గురు అధికారులు చిక్కారు. స్టేషన్ బెయిల్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌లో అడ్మిన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ రెడ్డి రూ. 50 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ విభాగం అధికారి యాదయ్య కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నాంపల్లిలోని గృహకల్ప భవనంలోని డీసీపీవో స్టేట్ జీఎస్టీ అధికారి కొమ్ము బుచ్చయ్య కూడా ఏసీబీ వలలో పడ్డారు. ఈయన రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.

- Advertisement -