చాలా దూరం వెళ్లిపోయా…జాను టీజర్

505
jaanu teaser
- Advertisement -

శర్వానంద్-సమంత హీరో,హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం జాను. తమిళ మూవీ 96కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేశారు.

ఎడారిలో బైక్ పై శర్వానంద్ సాగడంతో మొదలైన టీజర్‌లో చిన్ననాటి జ్ఞాపకాలు…సమంత-శర్వా మధ్య ఎమోషనల్ సీన్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. చాలా దూరం వెళ్లిపోయావారా అని సమంత అనగానే నువ్వు ఎక్కడ వదిలేశావో అక్కడే ఉన్నానుఉ అంటూ శర్వా చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులో కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. దిల్‌ రాజ్‌-శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవింద్‌ వసంత ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌.

- Advertisement -