అభిషేక్ బెనర్జీ..అక్రమ నిర్మాణాలపై కొరఢా!

2
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి జరిగిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ (TMC) అగ్రనేత అభిషేక్ బెనర్జీకి కష్టాలు మొదలైనట్లు కనిపిస్తోంది. ఆయనకు చెందిన ఆస్తులలో అక్రమ ర్మాణాలు జరిగాయనే ఆరోపణలపై కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) నోటీసులు జారీ చేసింది.

దక్షిణ కోల్‌కతాలోని హరీష్ ముఖర్జీ రోడ్‌లో ఉన్న టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అధికారిక నివాసం (188A), అలాగే దానికి ఆనుకుని ఉన్న కాళీఘాట్ రోడ్‌లోని 119 మరియు 121 నంబర్ల భవనాలకు ఈ నోటీసులు అందాయి. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1980లోని సెక్షన్ 401 కింద ఈ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలపై కేసు నమోదైన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

భవనాల నిర్మాణ సమయంలో మున్సిపల్ నిబంధనలను, నిర్మాణ ప్రమాణాలను సరిగ్గా పాటించారా లేదా అనే వివరాలను సమర్పించాలని కార్పొరేషన్ కోరింది. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా చేపట్టిన నిర్మాణాల వివరాలతో పాటు, ఆమోదించబడిన అసలు బిల్డింగ్ ప్లాన్‌ను అధికారులకు సమర్పించాలని ఆదేశించింది.

అధికారిక బిల్డింగ్ ప్లాన్ నుండి దారి తప్పి, అక్రమంగా నిర్మించినట్లు ప్రాథమికంగా గుర్తించిన భాగాలను ఏడు రోజుల్లోగా స్వయంగా కూల్చివేయాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఆ అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని యజమానికి సూచించారు. నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోకపోతే, మున్సిపల్ కార్పొరేషనే స్వయంగా కూల్చివేత పనులు చేపడుతుందని, దానికి అయ్యే ఖర్చులను సదరు యజమాని లేదా బాధ్యులైన వ్యక్తుల నుండి వసూలు చేస్తామని హెచ్చరించింది.

ఈ నోటీసు నిబంధనలను పాటించడంలో మీరు విఫలమైతే, మున్సిపల్ కమిషనర్ మీకు 7 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి, ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారు. ఆ కూల్చివేతకు అయ్యే ఖర్చులను మీ (యజమాని/బాధ్యులైన వ్యక్తి) నుండి రికవరీ చేయడం జరుగుతుంది. ఈ నోటీసు అందిన 7 రోజుల్లోగా భవన నిర్మాణ పూర్తి వివరాలను (ఎస్కలేటర్, లిఫ్ట్ వంటి స్ట్రక్చరల్ వివరాలతో సహా) అధికారులకు సమర్పించాలి అని కేఎంసీ ప్రకటించింది.

Also Read:చీకటిలో ఇండిగో విమానం!

ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ.. నేను మున్సిపల్ వ్యవహారాల కార్యదర్శి మరియు కేఎంసీ కమిషనర్‌కు 4 పేర్లను పంపించాను. బేలేఘాటాకు చెందిన రాజు నాస్కర్‌కు 18 ఆస్తులు ఉన్నాయి.కస్బాకు చెందిన సోనా పప్పుకు 24 ఆస్తులు ఉన్నాయి; మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి 24 ఆస్తులు ఉన్నాయి.జావేద్ ఖాన్ కుమారుడికి 90 ఆస్తులు ఉన్నాయి. వీరంతా ప్రజల సొమ్మును దోచుకున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఈ అవినీతిపరులను చట్టపరంగా జైలుకు పంపుతుంది” అని స్పష్టం చేశారు.

- Advertisement -