బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. పెళ్ళి అనంతరం సినిమాలకు దూరమైన ఐశ్వర్య ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ జంట తమ పెళ్లి రోజును కుమార్తె ఆరాధ్యతో కలిసి మాల్దీవుల్లో జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘హనీ అండ్ ది మూన్’ అన్న క్యాప్షన్ ను అభిషేక్ ఈ చిత్రానికి పెట్టారు. వీరిద్దరి 12వ పెళ్లి రోజు సందర్భంగా నీలంరంగులో ఉన్న మ్యాక్సీని ధరించి, అభిషేక్ చేతుల్లో ఐశ్యర్వ ఒదిగిపోయింది. ఇప్పటికే ఈ చిత్రానికి రెండున్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని ఆరాధ్య తీసిందట. ఇక ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాల్లో మరో పిక్ ను పంచుకున్నారు. అది కూడా వైరల్ అవుతోంది.