కేంద్రంపై అభిజీత్ విమర్శలు

4
- Advertisement -

ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించినంత మాత్రాన ప్రజల సమస్యలు పరిష్కారం కావని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులు, ఖాతాలపై చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజల్లో ప్రభుత్వంపై మరింత అవిశ్వాసాన్ని పెంచుతాయని హెచ్చరించారు.

ఎక్స్‌ వేదికగా అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ప్రతిరోజూ వేలాది పోస్టులు, ఖాతాలను తొలగిస్తున్నప్పటికీ అసలు విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ప్రజలు తమ సమస్యలను, ప్రశ్నలను వ్యక్తం చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ఒక వేదిక మాత్రమేనని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలకు కారణాలు సోషల్ మీడియాకు వెలుపల కూడా ఉన్నాయని, ఖాతాలను తొలగించడం ద్వారా వాటిని మాయం చేయలేరని స్పష్టం చేశారు.

ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వమే వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే, ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతుందని దీప్కే వ్యాఖ్యానించారు. యువత నిరుద్యోగం, పాలనలో లోపాలు, ప్రజా మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న పోస్టులను నియంత్రించేందుకు కేంద్రం సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.

Also Read:జియో ఐపీవోపై అంబానీ

- Advertisement -