- Advertisement -
కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కువగా వాడిన పదం ఆత్మనిర్బరత. ఇదే పదాన్ని ప్రతి సందర్భంలో ఉపయోగించారు మోదీ. ఇప్పుడు ఇదే పదం ఆక్స్‌ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా మారింది.
కరోనా మహమ్మారిని ప్రతి భారతీయుడు దీటుగా ఎదుర్కొని, నిలిచిన తీరుకు ఈ పదం అద్దం పడుతుందని ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజెస్ తెలిపింది. మోదీ ప్రసంగం తర్వాత ఆత్మనిర్భరత అన్న పదాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించినట్లు ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది.
సలహాదారుల కమిటీలో ఉన్న భాషా నిపుణులు కృతికా అగర్వాల్, పూనమ్ నిగమ్ సహాయ్, ఇమోజెన్ ఫాక్సెల్ ఈ పదాన్ని ఎంపిక చేశారు. ఓ దేశంగా, ఓ ఆర్థిక వ్యవస్థగా, ఓ సమాజంగా, వ్యక్తులుగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని మోదీ అన్న మాటలను ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజెస్ ప్రస్తావించింది.
- Advertisement -