ఆప్.. జాతీయ పార్టీగా అవతరించబోతోందా ?

208
- Advertisement -

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా అన్నీ రాష్ట్రాలలోనూ పాగా వేసి జాతీయ రాజకీయాలను శాసిస్తున్నాయి. కాగా ఈ రెండు పార్టీల పార్టీల తరువాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పార్టీలు లేవనే చెప్పాలి. అయితే ప్రస్తుతం తెలంగాణ నుంచి కే‌సి‌ఆర్, డిల్లీ నుంచి కేజ్రీవాల్ జాతీయ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కేజ్రీవాల్ ఆ విషయంలో కాస్త ముందు ఉన్నాడనే చెప్పాలి. ఇప్పటికే డిల్లీ నుంచి మొదలై.. పంజాబ్ లో సైతం పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మద్య ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటి, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు గట్టి హెచ్చరికలే పంపింది. .

ఇక గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా బరిలో నిలిచింది. అయితే ఆప్ ఈ రెండు రాష్ట్రాలలో ఎంతవరకు రానిస్తుంది అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే.. రెండు రాష్ట్రాల్లో కూడా 6 శాతం ఓట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ జోరు చూస్తుంటే 6 శాతం ఓట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరువాత స్పష్టమైన జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ అవతారిచడం ఖాయం అనే చెప్పవచ్చు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ప్రభావం జాతీయ రాజకీయాలలో గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక తాజాగా జరిగిన డిల్లీ మేయర్ ఎన్నికల్లో కూడా బీజేపీకి షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. మొత్తానికి ఆప్ అడుగుపెట్టిన ప్రతి చోట కూడా బలమైన ప్రభావం చూపుతూ దేశ రాజకీయాలను శాసించే దిశగా అడుగులు వేస్తోంది.ఇక ఆప్ దృష్టి ఇంతవరకు ఉత్తరాది రాష్ట్రాలపైనే ఉంది. అయితే జాతీయ పార్టీ హోదా దక్కిన తారువత దక్షిణాది రాష్ట్రాలపై కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా, ఆమ్ ఆద్మీ ప్రభావం కేజ్రీవాల్ ఆశించినంత లేకపోయినప్పటికి.. ఓటు శాతం మాత్రం గట్టిగానే సాధిస్తోంది. దీంతో జాతీయ పార్టీగా ఆప్ నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీగా అవతరించిన తరువాత కేజ్రీవాల్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఆప్ ఎంతవరకు పోటీ ఇస్తుంది ? అనేది ఇప్పుడు ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -