క్రిస్మస్ వార్…నెగ్గెదెవరో!

158
- Advertisement -

టాలీవుడ్‌కు సంక్రాంతి సినిమాలు ఎంత ముఖ్యమో అంతకంటే ముందు క్రిస్మస్ వార్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఏడాది కూడా క్రిస్మస్‌ వార్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఐదు సినిమాలు క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుండగా వాటి వివరాలు చూద్దాం..

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన కామెడీ ఎంటర్ టైనర్ ధమాకా. సినిమాపై మంచి అంచనాలున్నాయి. సినిమాను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా భారీ హిట్ కొట్టిన నిఖిల్ డిసెంబర్ 23నే మరోసారి అనుపమా పరమేశ్వరన్ జోడీగా సూర్యప్రతాప్ పల్నాటి రూపొందించిన ‘18 పేజెస్’ సినిమాతో రాబోతున్నారు.

సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జోడీగా నందిని రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతోన్న వెరైటీ లవ్ స్టోరీ ‘అన్నీ మంచిశకునములే’. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలకు రెడీ అయింది. విశాల్ హీరోగా ఎ.వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ ‘లాఠీ’. ఈ మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నారు.నయనతార మెయిన్ లీడ్ లో ‘కనెక్ట్’ అనే హారర్ థ్రిల్లర్ కూడా రీలీజ్ కాబోతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -