ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రాఘవ్ చద్దా నేతృత్వంలోని ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడి శుక్రవారం బీజేపీలో చేరారు. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల్లోనే, ఏఏపీ ఒక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియోను విడుదల చేసి బీజేపీపై ఎదురుదాడికి దిగింది. మూసి ఉన్న గదుల వెనుక ఈ నేతల చేరిక ఎలా జరిగిందో చూపిస్తూ రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వీడియోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఒక కార్యాలయంలో కూర్చుని ఉండగా, రాఘవ్ చద్దా లోపలికి ప్రవేశిస్తారు. అమిత్ షా సోఫాలో కూర్చుని ఉంటే, రాఘవ్ చద్దా వారికి అభివాదం చేసి సోఫాలో కాకుండా నేలపై కూర్చుంటారు. ఇది బీజేపీ నేతల పట్ల ఆయన విధేయతను లేదా దాసోహమయ్యే తత్వాన్ని సూచించేలా చిత్రించబడింది.
నితిన్ నబిన్ మాట్లాడుతూ.. రాఘవ్‌జీ, మీరు మంచి పని చేశారు. మీ పనితీరుపై మోదీజీ చాలా సంతోషంగా ఉన్నారు” అని అంటారు. దానికి చద్దా చేతులు కట్టుకుని “జీ సార్ (అవును సార్)అని బదులిస్తారు.రాఘవ్, నీ ఓపెనింగ్‌తో మేము సంతృప్తి చెందాం. కానీ ఇప్పుడు నువ్వు కొన్ని పెద్ద షాట్లు ఆడాలి. పంజాబ్‌కు చెందిన ఏఏపీ ఎంపీలను కూడా ఒప్పించాలి. దీనికి ప్రతిఫలంగా నిన్ను కేంద్ర మంత్రిని చేస్తాం అని అమిత్ షా చెబుతారు.
వెళ్లు రాఘవ్, ఏఏపీని విడగొట్టే పని మొదలుపెట్టు” అని అమిత్ షా అనగానే, చద్దా “జైసా ఆప్కా హుకుమ్, హుజూర్ (మీరు ఆజ్ఞాపించినట్లే మహాప్రభూ) అని అక్కడి నుండి బయలుదేరుతారు. ఈ క్రమంలో అమిత్ షా, నితిన్ నబిన్ నవ్వుతున్నట్లు వీడియోలో చూపించారు.
ఈ పరిణామంతో రాజ్యసభలో ఏఏపీ బలం గణనీయంగా తగ్గడమే కాకుండా, పంజాబ్ రాజకీయాల్లో కూడా పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది.
Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్

