ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఆప్ బీజేపీలు బాహాబాహీలకు దిగాయి. శుక్రవారం మేయర్ ఎన్నుకునే ముందుగా కౌన్సిలర్లు ప్రమాణం చేసే సమయంలో ఆప్ బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సంయమనం పాటించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ తోటి సభ్యులకు కొరింది. గత 15యేళ్లుగా బీజేపీ ఎంసీడీ లో మేయర్‌గా ఉన్న బీజేపీని కాదని ఢిల్లీ ప్రజలు గతేడాది డిసెంబర్ 4న జరిగిన ఎన్నికల్లో ఆప్ పట్టం కట్టారు.
ఆప్ 134సీట్లు గెలుచుకొగా, బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ 9సీట్లు గెలుచుకొంది. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూరంగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది. ఆప్ నుంచి షెల్లీ ఒబెరాయ్ ఉండగా బీజేపీ తరపునన రేఖా గుప్తా బరిలో నిలిచారు. అయితే ఎంసీడీ మేయర్ ఎన్నికలను ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న వేళ రసవత్తరంగా మారింది. ఇందులో మేయర్ పదవికి తెలుపు బ్యాలెట్ పేపర్ డిప్యూటీ మేయర్ కోసం ఆకుపచ్చ బ్యాలెట్‌లు మరియు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పేపరు కేటాయించారు.
ఇవి కూడా చదవండి…