నెట్టింట హల్చల్‌ చేస్తున్న జోర్దార్‌ జంట

113
- Advertisement -

రాకింగ్‌ రాకేష్‌… జోర్దార్‌ సుజాత.. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ప్రేమికుల జంటగా విపరీతంగా వైరల్ అవుతున్న ఈ జంటకు పెళ్లి కుదిరిందని.. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ కూడా టాక్‌ నడుస్తోంది. అయితే వీరిద్దరు ఇప్పుడు దుబాయ్‌ లో చేసిన రచ్చ మామూలుగా లేదు… వీరిద్దరు దిగిన పోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాఫిక్‌ గా మారాయి. ఇటీవల దుబాయ్‌ కి వెకేషన్‌ కు వెళ్లిన ఈ జంట తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే తాజాగా సుజాత బర్త్‌ డే సెలెబ్రేషన్స్‌ కు రాకేష్‌ ఘనంగా జరిపినట్లు తెలుస్తోంది.

సుజాతతో కేక్‌ కట్‌ చేయించిన రాకేష్‌ ఆమెకు ఆప్యాయంగా తినిపిస్తున్న పోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అటు సుజాత సైతం రాకేష్‌ కు ఆప్యాయంగా తినిపిస్తున్న ఫోటోలు కూడా హాట్‌ టాఫిక్‌ గా మారాయి. ఇదిలా ఉంటే… వీరిద్దరు జబర్ధస్త్ వేదికగా ఒకటయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ఈ జంట నెట్టింట్లో చేస్తున్న హంగామా మామూలుగా లేదనే చెప్పాలి. వీరిద్దరి మద్య రోమాంటిక్‌ ట్రాక్‌ కూడా ఓ రేంజ్‌లో ఉందంటున్నారు నెటిజన్లు. అయితే వీరిద్దరు అధికారికంగా తమ పెళ్లి వార్తను ఎప్పుడు అనౌన్స్‌ చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి 

మంచులక్ష్మిని బయపెట్టిన అనుష్క

అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోన్న రకుల్‌

సుమ అడ్డాలో చిరంజీవి

- Advertisement -