బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించిన దంగల్ సినిమా చైనాలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.2,000 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించినట్టుగా ఇప్పటివరకు మీడియాలో అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి.
ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ మ్యాగజైన్ కూడా ధృవీకరించింది.
చైనాలో 53వ రోజు రూ.2.5 కోట్లు వసూలు చేసిన దంగల్.. ఈ అరుదైన మార్క్‌ను అందుకున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. అంతే ఆ వార్తని చూడగానే అంతా ఆనందంలో మునిగిపోయారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం..’దంగల్’ అందరూ అనుకున్నట్టుగా రూ.2,000 కోట్లు వసూలు చేయలేదని తెలిసింది.
గత గురువారం వరకు ప్రపంచవ్యాప్తంగా చైనీస్ వెర్షన్ తో కలిపి దంగల్ రాబట్టిన మొత్తం వసూళ్లు 1,864 కోట్లు మాత్రమే అని దంగల్ సినిమా అధికార ప్రతినిధి తెలిపారు. ప్రముఖ మేగజీన్ ఫోర్బ్స్ కూడా 2,000 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన భారతీయ సినిమా అంటూ దంగల్ ను ప్రశంసించింది. అసలు ఆ కథనం ఆధారంగానే అంతా నమ్మేసారు. కానీ అసలు నిజం మాత్రం ఇంకా దంగల్ 2000 కోట్లకు దూరం లోనే ఉంది.
అయితే అయితే ఈ సినిమా 2000 కోట్లు కొట్టేసిందంటూ.. బాహుబలి 2 రేంజును కూడా దాటేసిందంటూ ఆల్రెడీ బాలీవుడ్లో సంబరాలు మొదలైన వేళ.. అబ్బే ఇంకా 2000 టచ్ అవ్వలేదు అంటే వారు ఫీలవుతున్నారు.
కానీ నిజం నిజమే కదా., ఇంకో భాషలోనో మరో దేశం లోనో రిలీజ్ అయ్యేంత వరకూ ఆ మార్క్ కి చేరుకోవటం కష్టమే.. ఒక్కరోజు కలెక్షన్లే రూ.87.66 కోట్లు అంటే చైనాలో దంగల్ సృష్టిస్తున్న ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. చైనాలో షావుయ్ జియావో బాబా (లెట్స్ రెజిల్, డాడ్) పేరుతో మే 5న దంగల్ రిలీజైంది. 9 రోజుల్లోనే ఈ మూవీ కలెక్షన్లు రూ.300 కోట్లు దాటింది.
చైనాలోని 9 వేల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. తొలి వారంలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఆ జోరులోనే రౌండ్ ఫిగర్ క్యాచ్ చేసేస్తుంది అనుకున్నారు గానీ ఇంకో 150 కోట్లవరకూ గ్యాప్ ఉంది. అయినా..నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చైనాలో భారీ వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.