‘రావే రావే.. నా చెలియా’అంటున్న ఆది..

89
crazy fellow
- Advertisement -

‘క్రేజీ ఫెల్లో’ సినిమా నుండి ‘రావే రావే.. నా చెలియా’ ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ మెలోడీయ‌స్ సాంగ్ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటుంది. అల‌రాజు సాహిత్యం కూర్చగా ఆర్ఆర్ దృవ‌న్ సంగీతం అందించారు. ఈ పాట‌ను శ్రీ రామ‌చంద్ర ఆల‌పించారు. ఈ చిత్రంతో సిరికి ఫ‌ణికృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ సాంగ్ లో ప్లసెంట్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు ఆది లుక్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. స‌తీష్ ముత్యాల కెమెరా విజువ‌ల్స్ బాగున్నాయి.

నటనకు ప్రాధాన్యత ఇస్తూ వ‌రుస‌గా సినిమాల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ఆది సాయికుమార్‌ ‘ప్రేమ‌కావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆది క్రేజ్ ఎలా ఉన్నా వ‌రుస పెట్టి సినిమాల‌ను మాత్రం ఓకే చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న ఆరు సినిమాల‌ను లైన్లో పెట్టారని సమాచారం. అందులో ‘క్రేజీ ఫెల్లో’కూడ ఉంది. ఈ మద్యే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ చిత్రంలో ఆదికి జోడీగా మిర్నా మీన‌న్,దిగంగ‌న సూర్య‌వంశీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

- Advertisement -