‘ఆ ఒక్కటీ అడక్కు’.. బ్లాక్ బస్టర్

14
- Advertisement -

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు

హీరో అన్ మేరిడ్ అని తెలియజేసేలా హిలేరియస్ ఎపిసోడ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. హీరోకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా 49 సార్లు వివిధ అమ్మాయిలచే రిజెక్ట్ అవుతాడు. మ్యారేజ్ బ్యూరోలు కూడా తనకి తగిన జోడి వెతకడంలో విఫలమౌతాయి. అతను ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. అయితే, రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లడానికి వారికి సమస్య ఉంది.

ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో మల్లి అంకెం ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పారు. కామెడీ సీక్వెన్స్‌లలో అల్లరి నరేష్ ఎప్పటిలాగే అదరగొట్టారు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లాకు కీలక పాత్ర లభించింది. ఆమె పాత్రలో చక్కగా అలరించారు. వెన్నెల కిషోర్, వైవా హర్షల ప్రజెంస్ తగిన వినోదాన్ని అందిస్తుంది.

సూర్య కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, గోపీ సుందర్ తన స్కోర్‌తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సరైన మూడ్‌ని సెట్ చేశాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.

టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రం ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read:కాజల్ అగర్వాల్.. “సత్యభామ” రిలీజ్ డేట్

- Advertisement -