ఆ ఫుటేజ్ అమ్మాలని తమన్నా ఆశ

33
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మతో సాగిస్తున్న ప్రేమ కుచ్ కుచ్ వ్యవహారం నిత్యం వార్తల్లో నానుతూనే ఉంది. తన పై పుకార్లు చెలరేగినా తమన్నా మాత్రం చాలా కూల్ గా ప్రియుడితో డేటింగ్ చేసుకుంటుంది. పైగా ఈ మధ్య తమన్నా సరికొత్త ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. ముంబైలో ఏ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా తమన్నాని పిలుస్తున్నారు. ఏ అవార్డు ఫంక్షన్ నిర్వహించినా తమన్నా ఉండాల్సిందే. ఈ ఈవెంట్స్ కి ఆమె కొత్త కొత్త పద్ధతులు డ్రెస్ అప్ అయి వెళ్తోంది. ఆ రకంగా తమన్నా ప్రస్తుతం ఫ్యాషన్ ఐకానయింది.

పైగా తమన్నా ఈవెంట్ లకు హాజరయ్యే తీరు మరో ఎత్తు. అటు డీప్ నెక్ అందాలు, ఇటు తొడల సౌందర్యాలు ప్రదరిస్తూ ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది. అది ఏ ఈవెంట్ అయినా సరే.. హాట్ హాట్ డ్రెస్సులు ధరించి పలువురు బాలీవుడ్ భామలకు గట్టి పోటీని ఇస్తోంది. దాంతో అందరి చూపులు తమన్నా వైపే వెళ్లిపోతున్నాయి. మొత్తానికి తన డ్రెస్సింగ్ తో తమన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. పైగా అడిగినా అడగకపోయినా ఫోటోగ్రాఫర్లను పిలిచి మరీ ఘాటు ఫోజులు ఇస్తోంది.

Also Read: Saindhav:జాస్మిన్‌గా ఆండ్రియా జెర్మియా

అసలు రూపాయి లాభం లేకపోతే.. చిన్న స్టిల్ కూడా ఇవ్వని తమన్నా.. ఇప్పుడు మాత్రం అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని నెటిజన్లు కూడా ఆలోచనలో పడ్డారు. ఆయితే, ఇదంతా తమన్నా కేవలం తన బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికే చేస్తోందట. త్వరలో నటుడు విజయ్ వర్మను తమన్నా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, కత్రీనా, నయనతార లా తాను కూడా తన పెళ్లిని క్యాష్ చేసుకోవాలని, ఏదొక ఓటీటీ సంస్థకు తన పెళ్లి ఫుటేజ్ ను భారీ మొత్తానికి అమ్మాలని తమన్నా ఆశ పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యింది.

Also Read: కుర్ర హీరోలతో చేస్తోందట

- Advertisement -