మత్తు ఎంత ప్రమాదమంటే మనిషిని బానిస చేసుకుంటుంది. మనిషిని మృగంగా మారుస్తుంది. అంతేకాదు ఈ మద్యం మత్తులో మనిషి మానవతా విలువలు మర్చిపోతున్నాడు. మద్యం తాగి మనిషి ఎన్నో అకృత్యాలు చేస్తున్నాడు. మనిషి మనిషిని ప్రేమించడం పరిచి మద్యని సేవించండం మొదలుపెట్టాడు..అందుకే మద్యం ముందు మానవత్వం ఓడిపోతుంది. మద్యం వల్ల జరిగిన అనర్ధాలు చాలనే ఉన్న తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే మాత్రం మనిషి కన్న మద్యం మిన్న అనేలా వుంది. అసలు విషయానికొస్తే..!
మహారాష్ట్రకు చెందిన జల్గావ్‌లోని భుసావల్ ఫౌజ్‌పూర్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ మద్యం బాటిళ్లతో కూడిన ట్రక్.. ఒక బైక్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురై రక్తం మడుగులో చావు బతుకుల కోసం పోరాడుతున్నారు. బాధితులు సహాయం కోసం అర్థించారు. అయితే దీనిని పట్టించుకోకుండా అక్కడున్న జనం మద్యం బాటిళ్లను కొల్లగొట్టే పనిలో పడ్డారు. బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కొందరు ప్రయత్నించినా, వారికి ఎవరూ సహకరించలేదు. ఆ ట్రక్కులోని మద్యం బాటిళ్లన్నీ కాళీ అయ్యాకే తీరిగ్గా బాధితులను ఆసుపత్రికి తరలించారు.