ప్రాణం తీసిన ప‌తంగి..

155
man dead for kite

సంక్రాంతి పండ‌గ అంటే మ‌న‌కు గుర్తొచ్చేది ప‌తంగులు. చిన్న పిల్లల నుంచి పెద్ద‌వాళ్ల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ ప‌తంగులు ఎగురేసుకుంటూ పండ‌గ‌ను ఎంజాయ్ చేస్తారు. అప్పుడ‌ప్పుడూ ప‌తంగులు ఎగిరేసే క్ర‌మంలో కొన్ని ప్ర‌మాదాలు కూడా జ‌ర‌గుతాయి. తాజాగా పతంగి ఎగ‌రేస్తుండగా బిల్డింగ్ నుంచి ప‌డి ఓ వ్య‌క్తి మృతిచెందాడు. సికింద్ర‌బాద్ చిల‌క‌ల‌గూడ పోలిస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈఘ‌ట‌న చోటుచేసుకుంది.

వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన సయ్యద్ ముక్తార్ పెద్ద కుమారుడు ఇమ్రాన్ అలియాస్ ఖలీద్ (27) తండ్రి స్క్రాప్ వ్యాపారంలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఖలీద్ తన ఇంటి రెండో అంతస్తులో స్నేహితులతో కలసి పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఖలీద్ మృతి చెందాడు.