ప్రపంచం శాస్త్రసాంకేతిక రంగంలో దూసుకుపోతోంది. ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన సౌకర్యలు కల్పించబడ్డాయి. ఇక ముఖ్యంగా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఎలాంటి రోగాలనైనా నయం చేయగలిగే శక్తి డాక్టర్ల చేతిలోకి వచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న కొంతమంది కార్పొరేట్ల మాయాజాలం వల్ల ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని దోపిడీ చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
ముఖ్యంగా ఫార్మా కంపెనీలు ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రపంచదేశాల్లో ఎక్కువమంది ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి షుగర్ వ్యాధి వస్తే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి. అంతేగాదు జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి.
అయితే వాస్తవానికి 1997కి ముందు ఫాస్టింగ్ షుగర్ లిమిట్ లెవల్ 140గా ఉండగా తర్వాతి కాలంలో దానికి 126కి తగ్గించాయి. ఇక 2003 తర్వాత అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ఫాస్టింగ్ షుగర్ లిమిట్‌ని 100కి తగ్గించింది. దీంతో దాదాపు 60 శాతం మంది భారతీయులు డయాబెటిక్ బారిన పడ్డారు. అయితే ఎవరికి అర్ధం కానీ విషయం ఏంటంటే ఎందుకు షుగర్ లిమిట్‌ని తగ్గించారో బ్రహ్మ రహాస్యమే. అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం ప్రపంచాన్ని 7 పెద్ద ఫార్మా కంపెనీలు శాసిస్తున్నాయి. వాటి మాయాజాలం ఫలితంగానే షుగర్ లెవల్ లిమిట్‌ని తగ్గించి ప్రజల్లో భయాందోళనను గురిచేసి లబ్దిపొందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏదిఏమైనా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఆరోగ్యవంతమైన జీవనం కోసం రోజువారి జీవన విధానంలో మార్పులు చేసుకుని వ్యాయామం,యోగా వంటివి చేస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు.
ఇవి కూడా చదవండి..