వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ అదరగొట్టింది.ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేశారు. తొలుత బ్యాట్‌తో తర్వాత బాల్‌తో మ్యాజిక్ చేశారు. ఇంగ్లాండ్ విధించిన 312 పరుగుల భారీ లక్ష్యచేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 39.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది.
ఓపెనర్ డికాక్(68),డుసిన్(50) తప్ప మిగితా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. ఏ దశలోనూ లక్ష్య చేధన దిశగా ప్రయత్నం చేయలేదు సఫారీలు. దీంతో ఇంగ్లండ్ చేతిలో 104 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ 3 వికెట్లు తీసుకోగా, ప్లంకెట్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో నలుగురు అర్ధ సెంచరీలు సాధించారు. జాసన్ రాయ్ 54, జో రూట్ 51, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 57 పరుగులు చేయగా, బెన్ స్టోక్స్ 89 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను రాణించిన బెన్ స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది.