ఏపీ స్పీకర్‌గా అంబటి రాంబాబు..?

458
Ambati Rambabu
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన జగన్ కేబినెట్ విస్తరణతో పాటు స్పీకర్ ఎంపికపై దృష్టిసారించారు. ఇక స్పీకర్ పదవికి ఎవరని నామినేట్ చేస్తారన్న చర్చ ఇప్పుడు వైసీపీలో జోరుగా నడుస్తుందట. అయితే స్పీకర్ పదవికి చేపట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి స్పీకర్‌ పదవి చేపట్టిన వారు శాసనసభకు దూరమవుతూ వస్తున్న ఆనవాయితీ వారిని భయపెడుతోంది.

అయితే ఏపీ స్పీకర్‌ రేసులో పలువురి పేర్లను జగన్‌ పరిశీలిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై విజయం సాధించిన వైసీపీ నేత అంబటి రాంబాబు పేరు స్పీకర్‌ పదవికి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాగ్దాటి కలిగిన నేతగా పేరొందిన అంబటి రాంబాబు అయితే స్పీకర్ పదవికి బాగుంటుందని జగన్ భావిస్తున్నారట.

ఒకవేళ రాంబాబు ఆ పదవి స్వీకరించడానికి నిరాకరించిన పక్షంలో బాపట్ల ఎమ్మెల్యేగా కోన రఘుపతి లేదా మేకతోటి సుచరిత పేర్లను ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరొందారు రఘుపతి. ఇక మంత్రిపదవి ఆశీస్తున్న సుచరితకు కేబినెట్‌లో స్ధానం దక్కకపోతే స్పీకర్‌ పదవిని కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నారట.

అయితే వీరెవరూ కూడా ఇష్టంగా స్పీకర్‌ పదవిని చేపట్టేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు స్పీకర్ పదవి చేపట్టిన నేతలు తర్వాత ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్‌గా ఎవరు ఎన్నికవుతారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -