ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

266
mlc polls

తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో స్ధానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరగుతుండగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కౌంటింగ్ జూన్‌ 3న జరుగుతుంది.

2,799 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రంగారెడ్డిలో 8, వరంగల్‌లో 10, నల్లగొండలో 7 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), ఎంగాల వెంకట్రామ్‌రెడ్డి (కాంగ్రెస్‌), ఇండిపెండెంట్లుగా ఎ.యాకయ్య, తక్కళ్లపల్లి రవీందర్, రంగరాజు రవీందర్‌ పోటీలో ఉన్నారు. రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, (టీఆర్‌ ఎస్‌), కోమరి ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్‌), నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి (టీఆర్‌ఎస్‌), కోమటిరెడ్డి లక్ష్మి (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు.

2014 ఓటర్ జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగనుంది. ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం జూన్ 5వ తేదీతో ముగియనుంది. కాబట్టి వీరంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరితో పాటు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు కూడా ఓట్లు వేయనున్నారు.జూన్‌ 3న ఫలితాలను ప్రకటించనున్నారు.