సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కాదు అనుకున్న కథను మరో హీరో ఒకే చెప్పడం కామన్ గా మారింది. సినిమా హిట్ అయ్యాక ఆ సినిమా నేను చేయాల్సి ఉండేది అని బాధపడ్డ వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ యువ దర్శకుడికి కూడా అదే అనుభవం ఎదురైంది. ఆర్ ఎక్స్ 100తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి తన తర్వాతి సినిమాను నాగచైతన్యతో చేద్దామనుకున్నాడు. చైతూకి కథ కూడా వినిపించాడు. కథ నచ్చడంతో మొదట్లో చైతూ కూడా ఓకే చెప్పేశాడు. కానీ సడెన్ ఏం జరిగిందో ఏమో గానీ అదే కథను మళ్లీ రవితేజకు వినిపించాడట అజయ్ భూపతి.
రవితేజ ఒకే చెప్పేయడంతో పూర్తీ కథను రెడీ చేసుకుంటున్నాడట. ఈసినిమాకు మహాసముద్రం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశాడు. రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా మూవీ లో నటిస్తున్నాడు. ఇటివలే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తీ చేసుకుంది. ఈమూవీ విడుదల తర్వాత అజయ్ భూపతితో రవితేజ సినిమా ఉండనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది.