‘డియర్ కామ్రేడ్’ నుండి ఆదిరిపోయే సాంగ్‌.. వీడియో

246
Dear Comrade

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. ఈసినిమాలో విజయ్ సరసన రష్మీక మందన కథనాయికగా నటిస్తుంది. విజయ్ స్టూడెంట్ పాత్రలో నటించగా..రష్మీక క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను విడుదల చేశారు. “కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే .. ఒడి చేరి ఒకటైపోయే .. తీరం కోరే ప్రాయం .. ” అంటూ ఈ రొమాంటిక్ సాంగ్ సాగుతోంది.

జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ – ఐశ్వర్య రవిచంద్రన్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన బాణీ అద్భుతంగా వుంది. ప్రేమగీతాల్లో ఉండవలసిన ఫీల్ ను ఆయన చాలా అందంగా ఆవిష్కరించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ గీతాల్లో ఈ పాట చేరిపోతుందని చెప్పొచ్చు. అనుభవాలు .. జ్ఞాపకాలు .. ఆలోచనలు కలబోసిన అందమైన విజువల్స్ తో ఈ పాట మనసును దోచేస్తోంది.

Dear Comrade Telugu - Kadalalle Lyrical Video Song | Vijay Deverakonda | Rashmika | Bharat Kamma