దేశ వ్యాప్తంగా 7విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రేపు నాల్గవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. రేపు దేశ వ్యాప్తంగా 9రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రేపు జరిగే ఎన్నికలతో ఒడిశాలో పూర్తిగా ఎలక్షన్లు ముగియనున్నాయి.
9 రాష్ట్రాల పరిధిలో మొత్తం 71 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మహారాష్ట్రలో 17 నియోజకవర్గాలకు, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, పశ్చిమ బంగలో 8, మధ్యప్రదేశ్, ఒడిశాలో 6, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకాశ్మీర్‌లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్ పోటీ చేస్తున్నారు. అలాగే యూపీలోని ఉన్నావ్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ సాక్షీ మహారాజ్ పోటీలో ఉన్నారు. ఇక ఈ సారి పశ్చిమబంగాలో ఎలాగైనా ప్రభావం చూపించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా ప్రచారాన్ని నిర్వహించింది. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ దత్ కూతురు ప్రియాంకదత్ – బాలీవుడ్ నటి ఉర్మిళ – బీజేపీ నేత పూనమ్ మహాజన్ ఎంపీలుగా పోటీచేస్తున్నారు.