28 డిగ్రీస్ సెల్సీయస్” చిత్రం టీజర్ విడుదల

249
28c movie
- Advertisement -

నవీన్ చంద్ర హీరోగా షాలిని వడ్నికట్టి హీరోయిన్ గా డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్ పతాకాలపై సాయి అభిషేక్ నిర్మిస్తోన్న చిత్రం “28 డిగ్రీస్ సెల్సీయస్”. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం ఏప్రిల్ 27న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సుమంత్, అడవి శేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సుమంత్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా, అడవి శేష్ చిత్ర టీజర్ ని లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ షాలిని వడ్నికట్టి, దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత సాయి అభిషేక్, ఎడిటర్ గారి బిహెచ్, కెమెరామెన్ వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటులు రాజా రవీంద్ర, వైవా హర్ష, నటీమణులు దేవియాని శర్మ, సంతోషి శర్మ తదితరులు పాల్గొన్నారు..

సుమంత్ మాట్లాడుతూ.. అనిల్ నాకు ఐదేళ్లుగా తెల్సు. బేసిగ్గా అతను డెంటిస్ట్. నా సినిమాకు కో ప్రొడ్యూసర్ గా కూడా చేసాడు. అప్పటినుండి అతనికి డైరెక్షన్ చెయ్యాలని ఫ్యాషన్. సినిమాపై పూర్తి అవగాహన ఉంది. ఒకసారి ఈ సినిమా లైన్ చెప్పాడు. అంతగా ఎక్కలేదు..కానీ టీజర్ చూసాక బాగా నచ్చింది.. కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడియెన్స్ కి రీచ్ అవుతుంది అనిపించింది. సినిమా బాగా తీసాడు. టీమ్ అందరికి ఆల్ ఠె బెస్ట్ అన్నారు.

అడవి శేష్ మాట్లాడుతూ… ఈ టీమ్ అంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు. క్షణం, గూఢచారి సినిమాలకు వర్క్ చేశారు. అనిల్ నాకు కర్మ సినిమా నుండి తెల్సు. మంచి టాలెంటెడ్. ఈ సినిమా తర్వాత నేను అనిల్ తో సినిమా చెయ్యలనుకుంటున్నాను. 28 డిగ్రీస్ సెలసియస్ టీజర్ జెన్యున్ గా నచ్చింది. సినిమా సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ… అరవింద సమేత లో బాల్ రెడ్డి క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అనిల్, అభిషేక్ వచ్చి నాకు కథ చెప్పారు. చాలా బాగుంది. టీమ్ అంతా మనసు పెట్టి వర్క్ చేశారు. వెరీ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది… అన్నారు.

- Advertisement -