ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ కోసం తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ.. ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టను మీడియాకు ప్రకటించారు.
ఇండియా టీం ఇదే..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధోనీ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, చాహల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్‌యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.
BREAKING: India have named their #CWC19 squad! pic.twitter.com/mMXt5kAG6Y
— ICC Cricket World Cup (@cricketworldcup) April 15, 2019
#TeamIndia for @ICC #CWC19 💪💪#MenInBlue 💙 pic.twitter.com/rsz44vHpge
— BCCI (@BCCI) April 15, 2019