- Advertisement -
సికింద్రబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఎన్నికల ఏజెంట్ పవన్ కుమార్ హైకోర్టులో ఈపిటిషన్ ను దాఖలు చేశారు. కిషన్ రెడ్డి బ్యాంకు నుంచి రూ.8కోట్లు విత్ డ్రా చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఓటరు స్లిప్పులతో పాటు బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డిపై ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిషన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పైనా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనున్నట్టు సమాచారం.
- Advertisement -