జెర్సీ 20 సార్లు చూశా: నాని

473
nani jersy
- Advertisement -

నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరో,హీరోయిన్లుగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన కెరీర్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్,హార్ట్ టచింగ్‌ సినిమా జెర్సీ అన్నారు నాని. ఈ నెల 12న ట్రైలర్‌ రిలీజ్‌ చేసి, 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తామని నాని వెల్లడించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో ఇన్ని రోజులూ మీడియా ముందుకు రాలేదన్నారు.

ఇప్పటికే జెర్సీ సినిమా 20 సార్లు చూశానని తెలిపారు. సినిమా చూస్తున్నంత సేపు స్క్రీన్ మీద ఉన్నది నేను కాదు అన్నట్లు నన్ను నేను మరిచిపోయానని తెలిపారు. ఈ సినిమాలో కేవలం అర్జున్‌ని మాత్రమే చూస్తారని చెప్పారు. ఈ సినిమా క్రికెట్.. క్రికెట్.. అని అంతా అనుకుంటున్నారు. కానీ, అందరికీ ఒక సర్‌ప్రైజ్ ఉంటుందన్నారు.

స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. సినిమా పిచ్చి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఆడటం మానేశానని తెలిపారు. సచిన్ రిటైర్ అయ్యాక క్రికెట్ చూడటమే మానేశానని చెప్పారు.

అవుట్ పుట్ అద్భుతంగా ఇవ్వడానికి దర్శకుడు గౌతమ్, కెమెరామెన్ సాను, ఎడిటర్ నవీన్ చాలా కష్టపడ్డారని చెప్పారు. వాళ్ల కష్టం చూస్తుంటే తాను ఇంకా కష్టపడాలి అనిపించిందన్నారు. అనిరుధ్ సంగీతం అంటే చాలా ఇష్టమని జెర్సీ తర్వాత నెక్ట్స్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’కు కూడా అనిరుధే మ్యూజిక్ డైరెక్టరని తెలిపారు నాని.

- Advertisement -